తీరనున్న డబుల్ రోడ్డు కల..
ఆత్మకూరు మండల ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న
దిశ,ఆత్మకూరు (ఎం): ఆత్మకూరు మండల ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డబుల్ రోడ్డు కళ తీరనుంది. మోత్కూరు-రాయగిరి ప్రధాన రహదారి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు గల డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కానున్నాయి. ఈ నెల 9న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేయనున్నారు. గత 10 ఏళ్ల నుంచి డబుల్ రోడ్డు ఎన్నికల హామీ, ప్రకటన లకే పరిమితం అయ్యింది. మండల కేంద్రంలోని సింగల్ రోడ్డు సరిగా లేక దశాబ్ద కాలం పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం శంకుస్థాపన చేస్తుండటంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డబుల్ రోడ్డు నిర్మాణం సంతోషకరం : మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేశ్,ఆత్మకూరు(ఎం)
గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన మాజీ ఎమ్మెల్యే డబుల్ రోడ్డు పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. ఏనాడు పట్టించుకోకుండా కాలయాపన చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సుమారు ఏడాదిలోనే డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండడం సంతోషకరం.