సైదన్న..చూడన్న..జాన్ పహాడ్ దర్గా వద్ద వసతులు కరువు..!
జాన్ పహాడ్ దర్గా దగ్గర వసతులు కరువైతున్నాయి.
దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : జాన్ పహాడ్ దర్గా దగ్గర వసతులు కరువైతున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా కు 400 ఏళ్ళ పైగానే చరిత్ర కలిగి ఉంది. ఈ దర్గాకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి ప్రతి శుక్ర,ఆదివారం తో పాటు ప్రతిరోజు భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
కోట్లలో ఆదాయం... అభివృద్ధి మాత్రం శూన్యం..
జాన్ పహాడ్ దర్గాకు వచ్చే భక్తుల నుండి, టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు గాని వక్ఫ్ బోర్డు అధికారులు కానీ ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చి వక్ఫ్ బోర్డు అధికారులకు డబ్బులను చెల్లించేవారు. కానీ వక్ఫ్ బోర్డు నుంచి మామూలుగా సదుపాయాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు సమకూర్చకపోవడంతో దర్గా ప్రాంతమంతా సమస్యలతో నిండి ఉంది.
దర్గా ప్రాంతమంతా మురుగునీరు.. దుమ్ము ధూళి
దర్గా ప్రాంతమంతా మురుగునీరు దుమ్ము ధూళితో మురుగునీరు అంతా మురికి కాలువలు రోడ్లపై ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఆ ప్రాంతమంతా అటవీ ప్రాంతం కావడంతో మట్టితో దుమ్ము కప్పేసినట్లు కనిపిస్తుంది.. ఇక్కడ భక్తులకు వసతి గదులను కల్పించకపోవడంతో వచ్చిన భక్తులు చెట్ల కింద వంటలు వండుకుని వసతి గృహాలుగా మార్చుకుంటున్నారు. ఈ ప్రాంతమంతా పిచ్చి మొక్కలు కంపు చెట్లతో నిండి ఉంది. అలాగే తాగునీరును కూడా భక్తులకు అందించిన పరిస్థితి కనిపిస్తుంది..
ఆరు బయటనే భక్తుల స్నానాలు..
ఇక్కడికి వచ్చే భక్తులకు స్నానాలు చేసేందుకు బట్టలు మార్చుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో వాటర్ ట్యాంక్ వద్ద బయటనే స్నానాలు చేసి బట్టలు మార్చుకునే దుస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ కూడా నాసుతో పేరుక పోయి ఉంది. ఈ వాటర్ తో స్నానం చేస్తే భక్తులకు చిదరపెట్టి దద్దుర్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమస్య ఎన్నో ఏళ్ళను ఉన్నప్పటికీ వీటిని శాశ్వత పరిష్కారం చూపించేందుకు వక్ఫ్ బోర్డు నేటికీ ఆసక్తి చూపడం లేదు.
దర్గా ప్రాంతం అభివృద్ధి కోసం రూ.65 లక్షలు మంజూరు..
దుర్గా ప్రాంతంలో కొంత సిసి రోడ్లు డ్రైనేజీ స్థానాల గదుల మరమ్మతులు చేసేందుకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్డిఎఫ్ నిధుల నుండి రూ.65 లక్షలు మంజూరు చేశారు. ఇది నిధుల ద్వారా ఆ ప్రాంతంలో కొంత డెవలప్మెంట్ దరువుద్దని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. ఈ పనులు అప్పటివరకు పూర్తి చేసే విధంగా చూడాలని మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈనెల 23 నుంచి దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం..
ప్రతి సంవత్సరం జనవరి నెల చివరి శుక్రవారం జరిగే ఉరుసు ఉత్సవాలు ఈనెల 23 నుంచి ప్రారంభమై 25 కు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి .ఈ ఉర్సు ఉత్సవాలకు రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు మూడు రోజుల పాటు రెండు లక్షల పైగానే భక్తులు హాజరవుతారు. వీటి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ అన్ని శాఖల అధికారులకు సమావేశం ఏర్పాటు చేసి ఉర్సుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దర్గా ప్రాంతమంతా ఆక్రమణ..
దర్గా చుట్టుపక్కల ప్రాంతమంతా వక్ఫ్ బోర్డ్ భూమి 9-20 ఎకరాలతో పాటు ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఈ భూమిని స్థానికులతో పాటు అక్కడ వ్యాపారం చేస్తే వారంతా ఆక్రమించి చిన్నపాటి షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మరికొందరు కాటేజీలుగా ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చే భక్తులకు అద్దెకు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఈ భూములను అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆక్రమణకు గురై ఈ ఆక్రమణ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారులు ఇప్పుడైనా గుర్తించి ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : షేక్ సైదులు, జాన్ పహాడ్ దర్గా
గత సంవత్సరం ఉత్సవాలకు వక్ఫ్ బోర్డు రూ.10 లక్షల వరకు ఇచ్చి ఆ డబ్బులతోనే ఉర్సు ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయిస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోకపోవడంతో సౌకర్యాలను పూర్తిస్థాయిలో భక్తులకు అందించలేకపోతున్నారు. కనీసం రూ.25 లక్షల వరకు అయినా వక్ఫ్ బోర్డు డబ్బులు కేటాయిస్తేనే ఉర్సు ఉత్సవాలు ఇలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించవచ్చు..
ఉర్సు ఉత్సవాలకు రూ. 20 లక్షలకు ఇవ్వాలని ఎస్టిమేషన్ వేసి పంపించాం : వక్ఫ్ బోర్డు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ స్పెక్టర్ షేక్ మహమ్మద్
ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.20 లక్షల వరకు ఇవ్వాలని వక్ఫ్ బోర్డు అధికారులకు ఎస్టిమేషన్ వేసి ప్రపోజల్ పంపించాము. మాకు వారి నుంచి ఇప్పటివరకు ఎంత అమౌంట్ ఇస్తామన్నది ఇంకా తెలియదు. అలాగే ఉర్సు ఉత్సవాలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చేసేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. స్థానికుల నాయకులు అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని పనులను చేపడుతున్నాము. అలాగే ఆక్రమ గురైన భూములను గుర్తించి అధికారులకు తెలియజేశారు.