నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ దినపత్రిక

మాడుగులపల్లి మండల పోలీస్ స్టేషన్ లో బుధవారం 2025 నూతన సంవత్సర దిశ దిన పత్రిక క్యాలెండర్ ను ఎస్సై కృష్ణయ్య ఆవిష్కరించారు.

Update: 2025-01-08 08:56 GMT

దిశ,మాడుగులపల్లి; మాడుగులపల్లి మండల పోలీస్ స్టేషన్ లో బుధవారం 2025 నూతన సంవత్సర దిశ దిన పత్రిక క్యాలెండర్ ను ఎస్సై కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా దిశ దినపత్రిక ఉందన్నారు. దిశ పత్రిక రంగంలో ప్రత్యేక స్థానం ఉందని,ఎప్పటి వార్తలు అప్పుడే పంపించి తక్కువ కాలంలోనే గొప్ప ప్రజా ఆదరణ పొందగలిగిందని మాడుగులపల్లి ఎస్సై ఎస్ కృష్ణయ్య అన్నారు. ప్రజా సమస్యలు వెలికి తీసి ప్రజలకు అతి దగ్గరగా చేరువయ్యే విధంగా పనిచేయాలని, వాస్తవా కథనాలను బయటికి తీయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జాఫర్, మాడుగులపల్లి దిశ రిపోర్ చెరుకుపల్లి రాజు, కానిస్టేబుల్ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News