డిజిటల్ మీడియాలో 'దిశ' పత్రికకు ప్రత్యేక స్థానం..

డిజిటల్ మీడియా రంగంలో ' దిశ' ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని, ఎప్పటికప్పుడు 'డైనమిక్ ఎడిషన్ల 'తో వార్తలను ప్రజలకు చేరవేస్తూ వారి మన్నలను పొందిందని నడిగూడెం ఇన్ చార్జ్ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎస్సై అజయ్ కుమార్ ఉద్ఘాటించారు.

Update: 2025-01-06 17:12 GMT

దిశ,నడిగూడెం: డిజిటల్ మీడియా రంగంలో ' దిశ' ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని, ఎప్పటికప్పుడు 'డైనమిక్ ఎడిషన్ల 'తో వార్తలను ప్రజలకు చేరవేస్తూ వారి మన్నలను పొందిందని నడిగూడెం ఇన్ చార్జ్ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎస్సై అజయ్ కుమార్ ఉద్ఘాటించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 2025 నూతన సంవత్సర 'దిశ' పత్రిక క్యాలెండర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా దిశ నిలుస్తుందని, ప్రజల సమస్యలను ప్రభుత్వం, అధికారులు దృష్టికి తీసుకెళ్లడంలో.. ముందు వరుసలో నిలుస్తుందని పేర్కొన్నారు. తనదైన శైలిలో వార్తలను ప్రచురిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీటీ హేమలత, ఆర్ ఐ గోపాల కృష్ణ, ఏఎస్సై జగన్నాథం, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ముదిరెడ్డి నళిని, మండల మహిళ నాయకురాలు, కరివిరాల మాజీ సర్పంచ్ గుర్రం నీలిమా గాంధీ, కార్యాలయ సిబ్బంది కళ్యాణి, ముఖేష్, ఉపేందర్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


Similar News