ప్రహరీ గోడ ధ్వంసం..గేటు,పైపులు చోరీ

రాజపేట గ్రామపంచాయతీకి చెందిన స్థలం ప్రహరీ గోడను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి.. గేటు పైపులను చోరీ చేసినట్లు సంబంధిత వెంచర్ యజమానులు మంగళవారం ఫిర్యాదు చేశారు.

Update: 2024-10-22 14:15 GMT

దిశ,రాజపేట:  రాజపేట గ్రామపంచాయతీకి చెందిన స్థలం ప్రహరీ గోడను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి.. గేటు పైపులను చోరీ చేసినట్లు సంబంధిత వెంచర్ యజమానులు మంగళవారం ఫిర్యాదు చేశారు. రాజపేట రెవెన్యూ పరిధిలో ఓ వెంచర్ యాజమాన్యం నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీకి ఇవ్వాల్సిన 10% స్థలాన్ని సుమారు 600 గజాలు అప్పగించారు. గ్రామపంచాయతీ స్థలం నిర్మించిన ప్రహరీ గోడ ధ్వంసమై గేటు, ఇనుప పైపులు చోరీకి గురైనట్లు గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


Similar News