కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం
మండలంలోని నాగార్జున పేట గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది.
దిశ, తిరుమలగిరి (సాగర్) : మండలంలోని నాగార్జున పేట గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం..మేకల కాపరి సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని మృతుడి ఫోన్ తో బంధువులకు సమాచారం అందజేశామని ఎస్సై వీరశేఖర్ తెలిపారు. అదవిదేవుల పల్లి మండలం కొత్తనంది కొండ గ్రామానికి చెందిన కొర్రా రాజశేఖర్ s/o బాలు (24 ) తన భార్య మమత,ఇద్దరు మగ పిల్లలతో మీర్ పేట హైదరాబాద్ లో ఉంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. తన కుటుంభ ఆర్ధిక పరిస్థితులతో మృతుడు 27.10.2024 న నాగార్జున సాగర్ కి హైదరాబాద్ నుంచి వచ్చాడు. మరుసటి రోజు తేదీ. 28.10.2024 న ఉందయం తన భార్య మమతకి ఫోన్ చేసి,పురుగుల మందు తాగుతున్నానని చెప్పి ఫోన్ పెట్టుకున్నాడు. ఆమె మృతుడి బంధువుకు ఫోన్ చేసిన కలువకపోవడంతో..మృతుడి భార్య అతను తప్పిపోయనట్లుగా మీర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. మృతుడి అన్న కొర్రా సురేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై కె..వీరశేఖర్ కేసు నమోదు చేశారు. శవం కుళ్లిన స్థితిలో ఉండటం వలన డాక్టర్ సంఘటన స్థలంకి పిలిచి శవ పంచనామా చేయించమని ఆయన తెలిపారు.