తక్కువ ధరకు వడ్లు కొంటే చర్యలు : ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి

ప్రస్తుత వానాకాలం సీజన్ కు గాను మిల్లర్లు రైతుల వద్ద తక్కువ ధరకు వడ్లు

Update: 2024-11-14 11:58 GMT

దిశ,హాలియా : ప్రస్తుత వానాకాలం సీజన్ కు గాను మిల్లర్లు రైతుల వద్ద తక్కువ ధరకు వడ్లు కొనుగోలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత సీజన్ లో గత నాలుగైదు రోజులుగా మిల్లర్లు రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే గురువారం వజ్ర తేజ రైస్ క్లస్టర్ల మిల్లులో ధాన్యం కొనుగోలు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్లు ఎవరైనా ధాన్యం కొనమంటే తనకు వెంటనే తగిన సమాచారం ఇవ్వాలని ఆ రైతులకు మద్దతు ధర తగ్గేంతవరకు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. ఆయకట్టులో వరి కోతలు ఊపందు పోవడంతో ఆయా మిల్లర్లకు ధాన్యం పెద్ద ఎత్తున వచ్చిందనీ ఈ పరిస్థితిని మిల్లర్లు అర్థం చేసుకొని రైతులకు సహకరించాలని సూచించారు.

తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు కొనని రైతు మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో సమీక్ష సమావేశాలు నిర్వహించామని ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగవద్దని ఆదేశించారు. తక్కువ తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మానవతా దృక్పథంతో మిల్లర్లు కొనుగోలు చేయాలని రైతులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సలహాదారు ఎడవల్లి నరేందర్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ కాకునూరి నారాయణ గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి కుందూరు రాజేందర్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ గౌస్ పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


Similar News