బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు

డిండి మండల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్త్య రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Update: 2023-11-02 03:48 GMT

దిశ, డిండి : రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు వడ్త్య రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో వడ్త్య రమేష్ నాయక్ ఉన్నారు. ఐటీ మంత్రి వడ్త్య రమేష్ నాయక్ ను గులాబి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్, కేతావత్ బిల్యానాయక్, గుర్రం రాములు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News