కళ్యాణం.. కమనీయం...
శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా బుధవారం జరిగింది.
దిశ, వలిగొండ : శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా బుధవారం జరిగింది. మండలంలోని వెంకటాపురం గ్రామంలో గల మత్స్యగిరి లక్ష్మినర్సింహ స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరు కాగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. స్వామి కళ్యాణానికి కుమ్మం దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అభివృద్ధి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. కళ్యాణ వేదిక ముందు వేద పండితులు స్వామి పురాణాన్ని భక్తులకు వివరిస్తూ ఆగమశాస్త్ర అనుసారం కళ్యాణాన్ని పంచమకళ్యాణంగా మత్స్యశ్వరుని కళ్యాణం నిర్వహించారు. స్వామి వారిని అచ్యుత గోత్రమని, అచ్యుత అంటే అందరిని కాపాడే వారని, ప్రతి జీవిని రక్షించడాన్ని అని అర్ధం.
అమ్మ వారిది సౌభాగ్య గోత్రమని, సౌభాగ్యం అంటే స్త్రీలు, లక్ష్మి అని, అష్టఐశ్వర్యాలు కలిగి ఉండాలని అర్ధం. భూదేవి అమ్మవారిది లావణ్య గోత్రమని, లావణ్యం అంటే అందం అని అర్ధం, మత్స్యగిరి కొండ నుంచి భూదేవి అందాలు పచ్చని పంటచేలు, కాలువలు, చెరువు అందాలను వీక్షించి పులకించి మనఃశాంతి పొందుతామని అన్నారు. కళ్యాణ వేడుకలు బాలికల నృత్యాలు, కోలాట ఆటలతో చూపరలను ఆకట్టుకున్నారు. శివసత్తుల లింగాలతో డోలు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామి వారి కళ్యాణం జరిగింది. అనంతరం స్వామి వారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని జంపాల రాంబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఈవో సల్వాద్రీ మోహన్ బాబు, ధర్మకర్తలు బండి రవికుమార్, ఈతాప రాములు, మైసోళ్ల వెంకటేశం, కొడితల కర్ణాకర్, బాలేశ్వర, గజ్జల అమరేందర్, కందుల శీను, జగన్మోహన్ రెడ్డి, జక్కుల కేతమ్మ, అరూర్ వెంకటేశం, రేఖల ప్రభాకర్, మైసోళ్ల అంజయ్య, ఊషయ్య తదితరులు న్నారు.
శ్రీమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కును చెల్లించుకోవడానికి 1000/- రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని కళ్యాణంలో పాల్గొనడానికి ఉత్సహంగా కూర్చున భక్తులు, అధికారులు, అర్చకుల తీరుతో ఒక్కసారిగా విస్మయం చెందారు. స్వామి వారి కళ్యాణ సయమంలో నిర్వహించే సాంప్రదాయాల తంతు సందర్భంగా దంపతులు కంకణాల మార్పిడి, భార్యాభర్తలు ఒకరి కొకరు కుంకుమ తిలకధారణలను భక్తులతో చేయించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వామి వారి కాల్లుకడిగి కన్యాదానం చేయడానికి కూర్చున్న దంపతులను పూర్తిగా విస్మరించి కల్యాణ తంతు నిర్వహించారు. కళ్యాణ మూర్తులను మాడవీదులల్లో ఊరేగిస్తూ కళ్యాణ వేదికవద్దకు తీసుకొచ్చారేగాని ఎదుర్కోళ్ల ఘట్టాన్ని విస్మరించినట్లుగా కనిపించింది. ఈ మేరకు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణం టికెట్లు కొన్న భక్తులు తమను విస్మరించడం పై తీవ్రంగా ఆగ్రహం చెందిన భక్తులు ఈవో మోహన్ బాబును నిలదీసి సామాన్య భక్తులకు మాకు ఏమి తేడా లేదని నిలదీశారు.