తండ్రి స్మార్ట్ ఫోన్ కొనివ్వ లేదని కొడుకు ఆత్మహత్య

తండ్రి స్మార్ట్ పోన్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2024-10-29 13:05 GMT

దిశ,రామన్నపేట : తండ్రి స్మార్ట్ పోన్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ పి.మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పల్లివాడ గ్రామానికి చెందిన మహంకాళి నర్సింహ్మను, కుమారుడు (15) స్మార్ట్ పోన్ అడగడంతో డబ్బులు లేవని కొద్దిరోజులు ఆగాలని తండ్రి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. ఈమేరకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానని రామన్నపేట ఎస్‌ఐ ఒక ప్రకటనలో తెలిపారు. అతిగారాబం చేయడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, క్రమ శిక్షణతో పిల్లలను పెంచాలని, స్మార్ట్ పోన్ లకు, వ్యసనాలకు, దూరంగా ఉండేలా తల్లిదండ్రుల పరిశీలనలో పెరగాలని మేధావులు పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు.


Similar News