Nagarjuna Sagar Dam : సాగర్ గేట్లు మళ్లీ ఎత్తారు, వెళ్లి చూసొద్దాం రండి.

నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద తరలివస్తోంది.

Update: 2024-10-19 13:10 GMT

దిశ,నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద తరలివస్తోంది. దీంతో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో అధికారులు 12 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దాటికి..వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా 12 గేట్లు ఎత్తి నీటిని కిందికి పంపిస్తున్నారు.12 గేట్లు ఐదు అడుగులు మేర పైకి ఎత్తి క్రస్ట్ గేట్ల తో 97200 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో : 140151 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 140151 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050లు కొనసాగుతుంది.

Tags:    

Similar News