రేషన్ గడువు పెంపు.. మాచన రఘునందన్
ప్రజాపంపీణీకి మార్చి నెల గడువును పొడిగించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్డార్ మాచన రఘునందన్ అన్నారు.

దిశ, మర్రిగూడ (నాంపల్లి) : ప్రజాపంపీణీకి మార్చి నెల గడువును పొడిగించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్డార్ మాచన రఘునందన్ అన్నారు. నాంపల్లి మండలంలో సోమవారం ఆయన చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ సాధారణ షెడ్యూల్ ప్రకారం రేషన్ కు గడువు 17 వ తేదీతో ముగిసిందన్నారు. కాని పలు కారణాల వల్ల ఆయా మండలాల్లో కొన్ని రేషన్ షాపు లకు ఇంకా స్టాక్ చేరని కారణంగా..ప్రజా పంపిణీ గడువు మరో 2,3 రోజులు పెంచే అవకాశం లేకపోలేదని రఘునందన్ ఆశా భావం వ్యక్తం చేశారు.లబ్దిదారులు పోర్టబిలిటీ సౌకర్యం తో వారికి నచ్చిన చోట తీసుకున్నప్పటికి ఇంకా పలు ప్రాంతాల్లో రేషన్ స్టాక్ చౌక దుకాణాల కు చేరాల్సిన పరిస్థితి ని దృష్టి లో పెట్టుకుని రాష్టం లో ని పలు జిల్లా ల తో పాటు నల్లగొండ కు కూడా రేషన్ గడువు ను ఈ నెల 19 లేదా 20 వరకు పొడిగించే అవకాశం ఉందని రఘునందన్ ఆశా భావం వ్యక్తం చేశారు.