ప్రభుత్వ విద్యాసంస్థలలోనే నాణ్యమైన బోధన : కలెక్టర్ హనుమంతరావు
ప్రభుత్వ విద్యాసంస్థలలోనే విద్యార్థులకు లక్ష్యాన్ని చేరే విధంగా బోధన
దిశ,రాజాపేట : ప్రభుత్వ విద్యాసంస్థలలోనే విద్యార్థులకు లక్ష్యాన్ని చేరే విధంగా బోధన జరుగుతుందని, నాయకత్వ లక్షణాలు అలవాడతాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పదవ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలలోనే విద్యార్థులకు లక్ష్యాన్ని చేరే విధంగా బోధన జరుగుతుందని, నాయకత్వ లక్షణాలు అలవాడతాయని అన్నారు. ఆటలతోపాటు విద్యలో కూడా రాణించాలన్నారు. బాలల దినోత్సవం రోజు రాజపేట గురుకులంలో గడపడం సంతోషంగా ఉందన్నారు. పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు గురువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి అనుకున్నది సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు.
అండర్ 14 అండర్ 17 అండర్ 19 విభాగాలలో ఛాంపియన్గా నిలిచిన ఘనపూర్ విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక తప్పును అందజేశారు. వారిని కోచ్ ను ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా ప్రిన్సిపల్ సుధాకర్ పూల మొక్కను అందజేసి చేనేత శాలువాతో సత్కరించి విద్యార్థి గీసిన కలెక్టర్ ఫోటోను అందజేశారు. నాలుగు రోజులపాటు విజయవంతంగా క్రీడలు నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, జోనల్ ఆఫీసర్ విద్యా రాణి,డి సి ఓ జగదీశ్వర్ రెడ్డి,స్థానిక ప్రిన్సిపాల్ సుధాకర్,క్రీడల సమన్వయకర్త జి.శ్రీనివాస్, పిడి వెంకటేశ్వర్లు,సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ బి.రాజు,జెవిపి శోభ రాణి,పి. ఈ. టి.శృతి తదితరులు పర్యవేక్షించారు. జోనల్ స్థాయి క్రీడలు ముగిసినట్లు కలెక్టర్ ప్రకటించారు.