విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈవో సత్యనారాయణ అన్నారు.
దిశ,భూదాన్ పోచంపల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈవో సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం స్టోర్ రూమ్,వంటగదిని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించేందుకు ఉదయం,సాయంత్రం గంటపాటు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 252 మంది ఉపాధ్యాయులను నియమించామని,ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సుమారు 4900 మంది పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, హెడ్ మాస్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.