మెరుపు వేగంతో వార్తలను అందించేది పత్రిక దిశ మాత్రమే.. ఎమ్మెల్యే

వార్త సమాచారం వేగంగా అందించడంలో "దిశ" ముందుంటుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. "దిశ" దినపత్రిక 2025 క్యాలెండర్ ను కోదాడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.

Update: 2025-01-05 10:00 GMT

దిశ, కోదాడ : వార్త సమాచారం వేగంగా అందించడంలో "దిశ" ముందుంటుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. "దిశ" దినపత్రిక 2025 క్యాలెండర్ ను కోదాడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "దిశ"యాజమాన్యానికి సిబ్బంది పాఠకులకు.. కోదాడ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మీడియా రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుపు వేగంతో వార్తలు అందిస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న "దిశ" దినదినాభివృద్ధి చెంది మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.

ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో దిశ తనదైన ముద్ర వేసిందన్నారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం దిశపత్రిక నైజం అని.. పాఠకులకు మరింత చేరువవుతూ భవిష్యత్తులో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టీపీసీసీ డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, దిశ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల వాసు, అనంతగిరి రిపోర్టర్ కొలిచలం శ్రీనివాస్, నడిగూడెం రిపోర్టర్ జహీర్, మోతే రిపోర్టర్ స్టాలిన్, చిలుకూరు రిపోర్టర్ రవీంద్రబాబు ఉన్నారు.


Similar News