protest : అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులపై నిరసన
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ మార్కండేయ దేవాలయం నుంచి వలిగొండ -నాగారం వెళ్లే రహదారి అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని చౌటుప్పల్ అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
దిశ, చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ మార్కండేయ దేవాలయం నుంచి వలిగొండ -నాగారం వెళ్లే రహదారి అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని చౌటుప్పల్ అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సదరు రోడ్డు నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ అధికారులు ఏడాది క్రితం ఒక లేయర్ కంకర పోసి ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. అసంపూర్తిగా మిగిలి ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. చౌటుప్పల్ లోని వివిధ పార్టీల నాయకుచౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ మార్కండేయ దేవాలయం నుంచి వలిగొండ -నాగారం వెళ్లే రహదారి అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని చౌటుప్పల్ అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.లు మంగళవారం సదరు రోడ్డుపై బైఠాయించి నిరసన ప్రదర్శన,రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని..అసంపూర్తి మిగిలిపోయిన డ్రైనేజీ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి బడుగు లక్ష్మయ్య, మున్సిపల్ అధ్యక్షుడు సుంకరి జంగయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, మండల ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిలివేరు రాజు, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు కంచర్ల గోవర్దన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పోలోజు శ్రీదర్ బాబు, బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల సురేందర్ రెడ్డి, ఊడుగు వెంకటేష్ గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, వనం ధనుంజయ, గోషిక పురుషోతత్తం, గోషిక నరహరి,టీడీపీ నాయకులు గోవిందా చారి,యట వెంకటేశం, తడక కోటేశ్వర్, గోశిక పాండు, గుర్రం నరసింహ, బోసి నరసింహ, చిన్నం కృష్ణ, కృష్ణతేజా, గణేష్, ఉపేందర్ చారి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.