నిర్మాణంలో ఉన్న చెరువు కట్టకు గండి
మండల పరిధిలోని చౌటపల్లి చెరువు కు గత రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి గండి పడింది.
దిశ,మఠంపల్లి : మండల పరిధిలోని చౌటపల్లి చెరువు కు గత రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి గండి పడింది. దీంతో చౌటపల్లి నుంచి మేళ్లచెర్వు కు రాకపోకలు నిలిచిపోయాయి.ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో చెరువు కట్ట తెగిపోయింది. ఆన్లైన్ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ,అధికారుల నిర్లక్ష్యం వల్ల నాసిరకం పనులు చేస్తుండంతో ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి కట్ట నిర్మాణం నాణ్యతతో నిర్మించాలని ఆయుకట్ట రైతులు కోరుతున్నారు.