పంట విక్రయానికి పడిగాపులు…నాలుగు రోజులుగా రోడ్లపైనే నివాసం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకోవడానికి రైతులు

Update: 2024-11-20 06:34 GMT

దిశ,నల్గొండ బ్యూరో : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకోవడానికి రైతులు పడిగాపులు పడాల్సి వస్తుంది. చల్లటి చలి, మంచు లో రోడ్డుపైనే రాత్రి వేళ నిద్రించాల్సి వస్తుంది . మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు రైతులు కూడా సమయం పడుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామ సమీపంలో ఉన్న లలితా పరమేశ్వరి కాటన్ మిల్లు లో కత్తి అమ్ముకోవడానికి వచ్చిన రైతుల తిప్పలు చెప్పతరము కానివి. ప్రైవేట్ వ్యాపారులు గ్రామాలకు వచ్చి మరి పంటను కొనుగోలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధర అందడం లేదని భావించిన రైతులు పత్తి మిల్లులో అమ్ముకోవడానికి వస్తున్నారు. కానీ ట్రాక్టర్లలో, డీసీఎంలలో పత్తి లోడ్ చేసుకొని వస్తే మూడు నుంచి ఐదు రోజుల వరకు సమయం పడుతుంది.

ఇలా రోజుల తరబడి రోడ్డుమీదనే ఎదురు చూసిన ట్రాక్టర్ యజమానులు పత్తి రైతు వద్ద రోజువారీ కిరాయి వసూలు చేయడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అమ్ముకున్న ధన కంటే తక్కువ స్థాయిలోనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు అధికంగా పత్తి లోడుతో వస్తున్నందున కాటన్ మిల్లు యజమాని దాదాపు 12 గంటల వరకు మిల్లు తెరిచి ఐదు గంటలకే క్లోజ్ చేయడం వల్ల ఎక్కువ సమయంలో వాహనాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోలేకపోతున్నారు. దీంతో రోజులకు కనబడి పత్తి రైతులు రోడ్డుపైనే ఉండాల్సి వస్తుంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పట్టించుకునే దిక్కు లేదు... ఏం మాత్రం పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు వాటిని మిల్లులలో పర్యవేక్షణ చేసి వేగంగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.


Similar News