కోదాడలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మెరుపు దాడులు

కోదాడ పట్టణంలో ఉన్న హోటల్ లలో, రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రాయపూడి

Update: 2024-11-20 05:22 GMT

దిశ,కోదాడ : కోదాడ పట్టణంలో ఉన్న హోటల్ లలో రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రాయపూడి కిరణ్ కుమార్ మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోనీ కొమరబండ బైపాస్ లో వద్ద ఉన్న మిడ్ల్యాండ్ హోటల్లో తనిఖీ చేయగా ఎక్స్పీరియా డేట్ అయిపోయిన కారం, పసుపు వాడుతున్నారని వాటిని సీజ్ చేసి శాంపిల్స్ ని తీసుకువెళ్లారు. అదేవిధంగా ఎవరైనా కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.విలువ గల మిస్ బ్రాండెడ్ పిండి వంటలను,పలు అనుమానిత శాంపిల్ ల ను సేకరించి పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది.నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నందుకు గాను వారికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అపరిశుభ్ర వాతావరణంలో తయారీనిర్వహించడం, అధిక మోతాదులో రసాయన రంగులను వాడటం, ఎక్స్పైర్ కలర్ స్పేస్  టాపింగ్ క్రీమ్స్, మిల్కీ మిస్టర్ క్రీమ్, ఆహార పదార్థాలను గుర్తించి వాటిని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ చట్టానికి విరుద్ధంగావ్యాపారాన్నికొనసాగిస్తున్నందుకుగాను నోటీసులు జారీచేయడం జరిగింది.

ఇంకా ఆహారతయారీలో కీటకాలు, దుమ్ము, బూజు వంటినాణ్యతా లోపాలున్నముడిపదార్థాలనుఉపయోగించడం,వంటనూనెలను పదేపదే మరిగించడం వంటి చర్యలు ఆల్సర్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికిదారి తీసే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో, ఆహారం విక్రయించేవ్యాపారులు ప్రజలకుసురక్షితఆహారంఅందించేందుకు జాగ్రత్తలుతీసుకోవాలని పలు నోటీసులు జారీ చేశారు.నిబంధనలుపాటించని,అనుమతులులేకుండాకార్యకలాపాలునిర్వహిస్తున్నవ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


Similar News