వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. తన చావుకి కారణం వారే అని సెల్ఫీ వీడియో విడుదల

కట్టుకున్న భార్య వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన

Update: 2024-11-20 07:12 GMT

దిశ, కోదాడ: కట్టుకున్న భార్య వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కోదాడ పట్టణంలోని భవాని నగర్ లో బుధవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని భవాని నగర్ కు చెందిన యూసఫ్ కు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సనకు యూసఫ్ కి ఆస్తి పంపకాల విషయంలో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై మొదటి భార్య మేళ్లచెరువు, కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. కాగా తన మొదటి భార్య తనపై అన్యాయంగా కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తుందని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి యూసఫ్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

తనను తన మొదటి భార్య గత కొద్ది రోజులుగా మేళ్లచెరువు, కోదాడ పట్టణ పోలీసులతో కలిసి బెరింపులకు పాల్పడటమే కాక ఆస్తిని ఆమె పేరు మీదకు రాసివ్వాలని వేధిస్తున్నారని ఆరోపించారు. ఆస్తి రాసి ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ కేసులు ఉపసంహరణకు ఒప్పుకోవడం లేదని, తలుపులు కొడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వీరి వేధింపులను భరించలేక బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుని నిద్రమాత్రలు వేసుకున్నట్లు చెప్పారు. తన చావుకు పూర్తి కారణం మొదటి భార్య సన, బామ్మర్ది పాషా, పోలీసులే అని ఆరోపించారు.


Similar News