దారుణం..బాలుడిపై పండ్ల వ్యాపారి లైంగిక దాడికి యత్నం

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో దారుణం

Update: 2024-11-20 03:49 GMT

దిశ, శేరిలింగంపల్లి : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి బాలుడి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ కలకత్తాకు చెందిన ఓ కుటుంబం నగరానికి వలస వచ్చి వివేకానంద నగర్ లో ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి ఇంటి సమీపంలోనే ఓ వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు.

అతను గత వారం రోజులుగా చిన్నారికి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి సమయంలో తన దగ్గరకు ఆడుకునేందుకు వచ్చిన బాలుడి నోరు మూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూం లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించటంతో బాలుడు కేకలు వేశాడు. అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని కాపాడి, లైంగిక దాడికి యత్నించిన పండ్ల వ్యాపారికి బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న కూకట్ పల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Similar News