దేవాలయ నిర్మాణ పనులు పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
చింతలపాలెం మండలం కిష్టపురం లో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ రాంబాబు మంగళవారం పరిశీలించారు.
దిశ ,చింతలపాలెం :చింతలపాలెం మండలం కిష్టపురం లో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ రాంబాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన సుమారు 22 లక్షల రూపాయలు బిల్లులను విడుదల చేయాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరగా..అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం దేవాలయంలో జరుగుతున్న నిర్మాణ ప్రగతి, పనుల నాణ్యతను ఆయన సమీక్షించారు. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాసులు, తహశీల్దార్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.