కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రంగంలో విధ్వంసం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో విధ్వంసం జరుగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు

Update: 2024-11-19 15:49 GMT

దిశ నేరేడుచర్ల (పాలకవీడు) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో విధ్వంసం జరుగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం పాలకవీడు మండలంలోని గుడుగుంట్ల పాలెం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి మాతృమూర్తి క్రిష్టిపాటి కామేశ్వరమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోగా..ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి అంజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వంలోని మంత్రులు వానకాలం సాగులో పండిన ధాన్యం చూపుతున్న లెక్కలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎడ్డేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యలను కప్పిపుచ్చుకోవడానికి ప్రస్తుతం సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేదని, రాష్ట్రంలో ధాన్యం లెక్కలపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో పండిన ధాన్యం కంటే ప్రస్తుతం రాష్ట్రంలో వరి సాగు తగ్గిందని అన్నారు. మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే జిల్లాల వారీగా ,మండలాల వారిగా ధాన్యం వివరాలను వెల్లడించే ధైర్యం మంత్రులకు ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారు... ఎంత బోనస్ చెల్లించారో సమగ్రంగా ప్రజలకు వివరాల అందించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో రైతులు దోపిడికి గురవుతున్నారని ప్రభుత్వ పెద్దలు బెదిరించి మిల్లర్ల వద్ద వసూలు చేసే కమిషన్ల వల్ల రైతులకు చెల్లించే ధాన్యం ధర తగ్గిపోయిందని అన్నారు. ఇప్పటికీ సగం పంట మాత్రమే కోతకు వచ్చిందని రానున్న రోజుల్లో వచ్చే పంటకు మరింత తక్కువ ధర వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికైనా మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని రైతు రుణమాఫీ కింద 12 వేల కోట్లు ఇచ్చి, పెట్టుబడి సహాయం 20 వేల కోట్లు ఎగ్గొట్టారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న ధాన్యం దిగుబడి కేసిఆర్ కట్టిన ప్రాజెక్టుల చలవేతో అని అన్నారు. ఎల్లంపల్లి నుంచి వచ్చిన ప్రతి చుక్క నీరు కేసిఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు వల్లనేనని దానికి సంబంధించిందని ,కాలేశ్వరంపై బురద జల్లడం మానుకోవాలని అన్నారు.

చాలామంది మంత్రులకు వ్యవసాయం మీద కనీస అవగాహన లేదని, వ్యవసాయం మీద అవగాహన ఉన్న తుమ్మల సైతం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కర్ర పెత్తనం వల్ల వ్యవసాయంపై తప్పుడు లెక్కలు చూపించి మాట్లాడుతున్నారని, తుమ్మల తన స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పిన తర్వాతనే ధాన్యం లెక్కలపై మాట్లాడతామని అన్నారు. అనంతరం శూన్య పాడు గ్రామంలో ఇటీవల మరణించిన సపవత్ చిన్ని చిత్రపటానికి పూలమాలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, డిసిసిబి డైరెక్టర్ అప్పిరెడ్డి, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్ ,కొప్పుల సైదిరెడ్డి కడియం వెంకటరెడ్డి జక్కుల నాగేశ్వరరావు , చెన్నబోయిన సైదులు అరిబండి సురేష్ బాబు ఎల్లబోయిన లింగయ్య, రాపోలు నవీన్ ,రమావత్ అశోక్ ,పసుపులేటి సైదులు , పల్లెపంగు నాగరాజు , పేరుమల సతీష్ ,సుదర్శన్ ,వెంకటరెడ్డి, పాల్గొన్నారు.


Similar News