llegal soil transport : యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా.. స్పందించని అధికారులు..

ప్రత్యేక జేసీబీలు.. అనుమతి లేని టిప్పర్లు.. దొరలా దొంగతనంగా మట్టి రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.

Update: 2024-07-31 10:47 GMT

దిశ, రాజాపేట : ప్రత్యేక జేసీబీలు.. అనుమతి లేని టిప్పర్లు.. దొరలా దొంగతనంగా మట్టి రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మట్టి రవాణా మండల కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ దగ్గర నుండి తహశీల్దార్ కార్యాలయం ముందు నుంచి జరుగుతున్నప్పటికీ స్పందించకపోవడం పట్ల మండల ప్రజలు రైతులు, ఆరోపణలు గుప్పిస్తూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజాపేట మండల కేంద్రం నుండి నర్సాపురం వెళ్లే రోడ్డు మార్గం గుండా టిప్పర్లలో మట్టి రవాణా చేస్తూ వెంచర్ స్థలాల్లోకి ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా అవుతుంది.

ఈ విషయంలో రైతులు, ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి అక్రమంగా మట్టి రవాణా జరుగుతుండగా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పట్ల అనుమానాలకు బలాన్నిస్తోంది. అక్రమ మట్టి రవాణా కవరేజికి మీడియా బృందం వెళ్లగా దొంగతనంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు కంటపడకుండా దాచి పెట్టారు. ఇప్పటికైనా అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, జేసీబీలను సీజ్ చేసి సంబంధిత యాజమాన్య ఓనర్లు డ్రైవర్లు వెంచర్ యజమానుల పై కేసు నమోదు చేయాలని రైతులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News