జల దిగ్బంధంలో నూతనకల్.. నీటిమయమైన నివాసాలు
రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం వల్ల నూతనకల్ మండల
దిశ,నూతనకల్ : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం వల్ల నూతనకల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు పూర్తిగా జలమయమైంది. వివరాల్లోకి వెళితే నూతనకల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇల్లులు పూర్తిగా జలదిగ్బంధమై నిత్యావసర వస్తువులు లేక ఇబ్బంది పడ్డారు. చేసేది ఏమి లేక గృహాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తలుపులు బిగించుకుని లోపలే ఉండగా, మరికొంతమంది రోడ్డుపైకి వచ్చి నిలబడి పరిస్థితి దాపురించింది.
ఎన్నడూ లేని విధంగా రాత్రి కురిసిన భారీ వర్షంతో పూర్తిగా మండల మంతా జలదిగ్బంధమై నీటితో నిండిపోయింది. మండల పరిధిలోని గుండ్ల సింగారంలో మూసి వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై ఉదృతంగా నీరు ప్రవహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిల్పకుంట్లలోని బత్తుల కిరణ్ కుమార్ ఇల్లు పూర్తిగా నీటితో నిండిపోయి చెరువుల తలపిస్తుంది. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా కాలువలు నిర్మించ కపోవడంతో ఇంట్లో నీరు బయటకు వెళ్లక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వ అధికారులు పరిస్థితిని అర్థం చేసుకొని సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు.