సాగర్ సమీపంలో నయాగరా అందాలను తలపిస్తున్న జలపాతం

ఎత్తిపోతల జలపాతం నయాగరా అందాలను తలపిస్తోంది. ఈ దృశ్యాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఎత్తిపోతలకు తరలి వస్తున్నారు.

Update: 2024-09-01 03:50 GMT

దిశ, నాగార్జునసాగర్: ఎత్తిపోతల జలపాతం నయాగరా అందాలను తలపిస్తోంది. ఈ దృశ్యాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఎత్తిపోతలకు తరలి వస్తున్నారు. కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఈ ఎత్తిపోతల ఉంది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండల్లో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యంలో తాళ్ళపల్లి వద్ద 70 అడుగుల ఎత్తు నుంచి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన కృష్ణా నదిలో కలుస్తుంది.

పాల నురగల జలపాతాలు.. ఆహా ఎంత బాగుందో కదా ఆ ఊహ. వర్షాలు వస్తే పోటెత్తే జలపాతాల అందాలను అలా చూస్తుంటే అలా ఎంత సమయమైనా అక్కడే ఉండి పోవాలి అనిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఇట్టే ఆ జలపాతాల అందాలతో ప్రేమలో పడిపోతారు ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పాల నురగల జలపాతాలు. ఆహా ఎంత బాగుందో కదా ఆ ఊహ. వర్షాలు వస్తే పోటెత్తే జలపాతాల అందాలను అలా చూస్తుంటే అలా ఎంత సమయమైనా అక్కడే ఉండి పోవాలి అనిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఇట్టే ఆ జలపాతాల అందాలతో ప్రేమలో పడిపోతారు. అటువంటి జలపాతాలు ప్రకృతి ప్రేమికుల్ని మరెంతగానో కట్టిపడేస్తాయి. ఆ అందాలు ఇప్పుడు ఎక్కడో కాకుండా

ఈ ప్రాంతం పర్యాటకులతో పోటు ఎత్తుతుంది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ద్వారా దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వదలడంతో.. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు హాజరవుతున్నారు. నేడు ఆదివారం కావడంతో హైదరాబాద్ నుండి కూడా.. పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జునసాగర్ సమీపంలోని సుందర జలపాతాలను సందర్శిస్తున్నారు.ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతం. ఇక్కడ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది నాగార్జున సాగర్ డ్యాం నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం ఎత్తిపోతల జలపాతాలు అని పిలువబడే విశాలమైన జలపాతాలకు నిలయం. ఈ జలపాతం నిజానికి ఒక పర్వత ప్రవాహం, ఇది కొండ దిగువన ప్రశాంతమైన చెరువు ఏర్పడటానికి 22 మీటర్ల దిగువకు వస్తుంది.

ఈ జలపాతం నిజానికి నక్కల వాగు, చంద్రవంక వాగు, తుమ్మల వాగు అనే మూడు చిన్న నదుల కలయిక. జలపాతం కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం ఎత్తిపోతల జలపాతానికి పోటెత్తింది. దీంతో 70 అడుగుల ఎత్తైన ఎత్తిపోతల జలపాతం నుండి జాలువారుతున్న వరద నీరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పరిసర వాగులు, అటవీ ప్రాంతంలో వంకలు వరద నీటితో నిండి ఎత్తిపోతల జలపాతం వైపు దూసుకురావడంతో పచ్చటి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వారాంతం కావడంతో ఎత్తిపోతల జలపాతం అందాలు చూసేందుకు సందర్శకులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జలపాతాల దృశ్యాన్ని చూస్తున్న పర్యటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లతో సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు తీసుకుంటూ కుటుంబాలు ఎంజాయ్ చేస్తున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం ఎత్తిపోతల జలపాతం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పర్యాటకశాఖ. ప్రకృతి సోయగాల మధ్య జాలువారుతున్న కృష్ణమ్మ పరవళ్లు చూసి.. సేదతీరుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులు. గడిచిన రెండు సంవత్సరాల తర్వాత సాగర్ కు పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో పాటు.. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో జలపాతాలను వీక్షించేందుకు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు.


Similar News