ఢిల్లీలో మోదీ, భువనగిరిలో బూర గెలుపు తధ్యం

మోదీ పాలనలోనే దేశం భద్రంగా ఉంటుందని భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

Update: 2024-03-14 13:10 GMT

దిశ, చండూరు: మోదీ పాలనలోనే దేశం భద్రంగా ఉంటుందని భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. లోకసభ ఎన్నికల దృష్ట్యా గురువారం చండూరులో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఉప్పెనల మోదీకి అభిమానులు ఉన్నారని అన్నారు. ఈ సారి కూడా కేంద్రంలో ఢిల్లీలో మోదీ భువనగిరిలో బూర గెలుపు తధ్యం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాకంటే ముందు, తర్వాత ఎంపీ లుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. నా హయాంలో భువనగిరి లోక్ సభ స్థానంలో లక్ష కోట్ల సంపద పెరిగిందని అన్నారు. అదే సమయంలో నా సంపద తగ్గిన కోమటిరెడ్డి ఆస్తులు పెరిగాయని గుర్తు చేశారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని అధికారంలోకి వచ్చే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని కావడం ఎంత అతిశయోక్తి, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావడం కూడా అంతే అన్నారు. గత పది సంవత్సరాలుగా దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి, దేశ భద్రతకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం, నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం, జిల్లా నాయకులు కోమటి వీరేశం, జనార్దన్ రెడ్డి నాగార్జున, రావిరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Similar News