పేదలకు పంచే ఇంటి స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలో ఈరోజు పేద ప్రజలకు పంచాల్సిన ఇండ్ల స్థలాలను నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి పరిశీలించారు.

Update: 2024-11-13 13:19 GMT

 దిశ, గుర్రంపోడు : గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలో ఈరోజు పేద ప్రజలకు పంచాల్సిన ఇండ్ల స్థలాలను నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇల్లు లేని ప్రతి పేదవాడికి భూమిని ఇచ్చి, ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా భూమి ఉన్న ప్రతి పేదవారికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తగుళ్ల సర్వయ్య, ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మార్వో , మాజీ జెడ్పిటిసి, మాజీ ఎంపీపీ ,మాజీ సర్పంచులు, యువజన నాయకులు, మండల నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News