పీహెచ్సీలో మండల టాస్క్ ఫోర్స్ సమావేశం
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై మండల స్థాయి అధికారుల టాస్క్ ఫోర్స్ సమావేశం మండల వైద్యాధికారిని ఆశ్రిత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

దిశ, నూతనకల్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై మండల స్థాయి అధికారుల టాస్క్ ఫోర్స్ సమావేశం మండల వైద్యాధికారిని ఆశ్రిత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో.. ఉదయం 11 గంటలకు ముందు, సాయంత్రం 4 గంటల తర్వాత అత్యవసరం తప్ప బయటకి వెళ్లకూడదని సూచించారు. తరచుగా మంచినీళ్లు తాగడం, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని తెలిపారు. ఎక్కువగా తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని, రోడ్లపై దొరికే పానీయాలు తీసుకోకూడదని అన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తల దగ్గర ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, వాటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చరణ్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏపీవో శ్రీరాములు, సీనియర్ అసిస్టెంట్ రామచంద్రయ్య,తదితరులు ఉన్నారు.