యాపిల్ సాగు పై అవగాహన పెంచుకోవాలి.. మార్కెట్ కమిటీ చైర్మన్
యాపిల్ సాగు పై అవగాహన పెంచుకోవాలని హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

దిశ, హాలియా : యాపిల్ సాగు పై అవగాహన పెంచుకోవాలని హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పులిమామిడి గ్రామంలో యాపిల్ సాగును ఆయన పరిశీలించారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కొత్తగా ఆలోచించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు... ఆదాయం చేకూర్చే పంటల సాగు పై కొందరు అన్నదాతలు దృష్టి సారించాలన్నారు. వరి, మొక్కజొన్న, పత్తిపంటలతో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ వస్తుండడంతో లాభాలు పొందే ఇతర పంటల వైపు రైతులు మొగ్గుచూపాలన్నారు. సాగు చేసిన కశ్మీర్ యాపిల్ బేర్ సాగు రైతులు ఆకర్షించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ లాభాలను ఆర్జించాలన్నారు. కొత్తగా సాగు చేసే పంట అధికారులు, ఇతర జిల్లాలకు చెందిన రైతులతో కలిసి సాగు వివరాలు తెలుసుకోవాలన్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైనా ప్రస్తుతం లాభాలు రావడంతో సంతృప్తిగా ఉంటుందన్నారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైకాని లక్ష్మయ్య యాదవ్, కోట నాగిరెడ్డి, నాగరాజు, హనుంత్ రెడ్డి, సైదులు తదితరులు ఉన్నారు.