రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన పేట గ్రామంలో జరిగింది.

Update: 2025-03-14 15:23 GMT
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు..
  • whatsapp icon

దిశ, గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన పేట గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్ఐ చలి కంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్లకు చెందిన పారేపల్లి శ్రీను, మహేందర్ లు వారి బైక్ పై నేరేడుచర్ల నుంచి హుజూర్ నగర్ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ముందు వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బైకు ట్రాక్టర్ టక్కుకు వెనుక తగిలి బైక్ పై ఉన్న ఇరువురు గాయాలపాలయ్యారు. స్థానికుల సహాయంతో వారిని ఇరువురిని 108 లో అంబులెన్స్ హుజూర్ నగర్ కు తరలించారు. బాధితుడు శ్రీను మామ బత్తిని లక్ష్మినర్సు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చలిగంటి నరేష్ తెలిపారు.


Similar News