గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ…

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ వస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

Update: 2024-03-13 12:11 GMT

దిశ, నకిరేకల్ టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ వస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్డుని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. నకిరేకల్ నుండి గురజాల వరకు రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న ఆదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కావాలనే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని వారికి బుద్ధి చెబుతామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరుగుతోందన్నారు. జిల్లా మంత్రులు నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు ధనలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు చౌగొని శ్రీనివాస్, యాసారపు వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, నాగులవంచ వెంకటేశ్వరరావు, ఉప్పల రమేష్, గడ్డం స్వామి, గాజుల సుకన్య, ఏసు పాదం, తదితరులు పాల్గొన్నారు.


Similar News