Nagarjunasagar : బిర బిరా కృష్ణమ్మ నాగార్జున సాగర్‌ వైపు పరుగులిడుతుంటేను...

బిర బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. నాగార్జున సాగర్‌ బంధనాల నుంచి విముక్తి పొంది సాగరం దిశగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

Update: 2024-07-31 16:00 GMT

దిశ, నాగార్జునసాగర్ : బిర బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. నాగార్జున సాగర్‌ బంధనాల నుంచి విముక్తి పొంది సాగరం దిశగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్‌ దిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. కర్ణాటకతోపాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద దెబ్బకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో జలకళ తొణికిసలాడుతుంది. శ్రీశైలం డామ్‌పై ఉన్న విద్యుత్ కాంతులు ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం రాత్రి మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ కాంతుల వెలుగుల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ సుందర దృశ్యం మహా అద్భుతంగా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఎగువన కృష్ణా బేసిన నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో అడుగు దూరం మాత్రమే ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులుగా ఉంది.

నాగార్జునసాగర్‌ వైపు తరలివస్తున్న కృష్ణమ్మ..

నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద పోటెత్తుతోంది. గత మూడో రోజులుగా శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు 2,18,622 క్యూసెక్కుల వరద ఉదృక్తి కొనసాగుతుంది.బుధవారం సాయంత్రానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 529.00 అడుగుల వద్ద నీరు నిల్వవుంది. ఇది 164.2680 టీఎంసీల కు సమానం.కుడి కాలువ ద్వారా 5,944 క్యూసెక్కుల నీరు, ఎస్.ఎల్.బి.సి ద్వారా 900క్యూసెక్కుల నీటిని మొత్తం 6844క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఎడమ కాలువకు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు కాగా ప్రస్తుతానికి 884.50 అడుగుల వద్ద నీరు నిల్వవుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి 3,62,411 క్యూసెక్కుల వరద జలాశయానికి వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం,పది రోజుల్లో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది. సాగర్​ జలాశయనికి నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ఎడుమ కాలువ కింద రైతన్నలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా సాగు నీటి విడుదలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.వరద ఇలాగే కొనసాగితే రెండు,మూడు రోజుల్లో ఎడమ కాల్వకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News