గ్రామాల అభివృద్ధే లక్ష్యం : మిర్యాలగూడ ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని

Update: 2024-11-26 09:15 GMT

దిశ,మిర్యాలగూడ : గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి, చిట్యాల, దామరచర్ల మండలం నర్సాపురం, మిర్యాలగూడ మండలం జాలు బాయి తండా గ్రామాలలో ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడం లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, పొదిళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Similar News