ప్రజా ప్రభుత్వం లోనే పల్లెల ప్రగతి : ఎమ్మెల్యే కుందూరు జై వీర్

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని

Update: 2024-11-26 09:23 GMT

దిశ,హాలియా : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. మండలంలోని పంగవానికుంట గ్రామంలో రూ.20 లక్షల రూపాయల గ్రామీణ ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ కార్యాలయం భవన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన విషయం గుర్తు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.

వచ్చే ఐదేళ్లలో గ్రామపంచాయతీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుజాత పీసీసీ డెలికేట్ కర్నాటి లింగారెడ్డి హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సలహాదారు ఎడవల్లి నరేందర్ రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్ పంచాయతీరాజ్ డి ఈ రామాంజనేయులు ఏఈ సైదులు ఇంఛార్జి ఏపీవో ప్రవీణ్, తేరా రంగారెడ్డి, నాగార్జున రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News