సంక్షేమ పథకాలు నేరుగా పేదలకే.. నలమాద పద్మావతి
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిసంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారులకే చేరుతుందని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని నలమాద పద్మావతి అన్నారు.
దిశ, చిలుకూరు : రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిసంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారులకే చేరుతుందని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని నలమాద పద్మావతి అన్నారు. బేతవోలులో ఆదివారం సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. గత అయిదేళ్లుగా ప్రతి సంక్షేమ పథకంలో పేదలైన లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ నాయకులు లంచాలు దండుకుంటున్నారని ఆమె ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విధుల్లో అనవసర జోక్యం చేసుకోనని ఆమె స్పష్టం చేశారు.
తన పరిధిలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని పద్మావతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీపీ బండ్ల ప్రశాంతి కుమారి కోటయ్య, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, ఎంపీటీసీలు వట్టికూటి ధనమూర్తి, సైదాబాబు, మండవ శైలజ మధు, సర్పంచులు వట్టికూటి చంద్రకళ నాగయ్య, కొడారు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ యడవెల్లి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి పిండ్రాతి హనుమంతరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కొనకంచి వెంకటేశ్వర్లు, రెమిడాల ఆనంద్, సీహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ కార్యకర్తలు..
ఈ సమావేశంలో బేతవోలుకు చెందిన దాదాపు ఐదారు వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కోదాడ కాంగ్రెస్ అభ్యర్థిని నలమాద పద్మావతి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.