Collector : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

శాలిగౌరారం మండలం లో ఈ ఖరీఫ్ దాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని నూతన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.ఆ

Update: 2024-11-01 10:33 GMT

దిశ,శాలిగౌరారం : శాలిగౌరారం మండలంలో ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని నూతన జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు.ఆమె శుక్రవారం ఆకస్మికంగా శాలిగౌరారం మండలంలో పర్యటించారు. ధాన్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, తూకం యంత్రాలు,తేమ కొలిచే యంత్రాలు,ఇతర అన్ని రకాల సామాగ్రిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయడమే కాకుండా,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని,ఐకెపి, పిఎసిఎస్ అన్ని ఏజెన్సీలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. కొనుగోలు చేసిన దాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేయడం పూర్తి చేయాలని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సామజిక సర్వే ను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..సమగ్ర కులగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, స్పెషల్ ఆఫీసర్లు,అధికారులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని,సర్వే కార్యకమాన్ని నిర్వహించే సూపర్వైసర్లు,ఎన్యూమరేటర్లు అన్ని అంశాలను సరైన పార్మేట్ లలో పొందుపరచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్, మాన్యనాయక్, తహసీల్దార్ పి యాదగిరి,ఎంపిడివో జ్యోతి లక్ష్మి,ఎంపివో పద్మ,ఏపీఎం జానకి,సూపర్ వైసర్లు ఎమ్ డి. అజహర్,ఎస్.రాజు,గంజి రాంబాబు,మేడే రాములు, ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News