ఘనంగా కనకదుర్గ జాతర ప్రారంభం

మహా శివరాత్రికి ముందు వచ్చే రెండో శుక్రవారం మండలంలోని జెర్రిపోతులగూడెంలో కనకదుర్గ జాతర (బండ్ల పండుగ) నిర్వహించడం ఆనవాయితీ.

Update: 2025-02-14 10:20 GMT
ఘనంగా కనకదుర్గ జాతర ప్రారంభం
  • whatsapp icon

దిశ, చిలుకూరు: మహా శివరాత్రికి ముందు వచ్చే రెండో శుక్రవారం మండలంలోని జెర్రిపోతులగూడెంలో కనకదుర్గ జాతర (బండ్ల పండుగ) నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామంలో జాతర ప్రారంభమైంది. గురువారం సాయంత్రం స్థానికులు తమ ట్రాక్టర్లను ప్రభలతో అలంకరించి కనకదుర్గ ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు నిర్వహిస్తారు. శుక్రవారం భక్తులంతా కనకదుర్గను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరతో గ్రామంలో సందడి నెలకొంది. స్థానికులు తమ బంధు, మిత్రులనందరినీ ఆహ్వానించి ఉత్సవం చేసుకుంటారు. ఆయా రాజకీయ పార్టీలు తమ తమ వేదికలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో నిబంధనల పరిధిలోనే ఉత్సవం నిర్వహించుకోవాలని కోదాడ రూరల్ సీఐ రజితా రెడ్డి సూచనల మేరకు ఆయా పార్టీల నాయకులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్సై సురభి రాంబాబు తమ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు.


Similar News