గుడ్ న్యూస్: నల్గొండ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ మున్సిపాలిటీలో ఇండ్లు లేని నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుభవార్త చెప్పారు.
దిశ, నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటీలో ఇండ్లు లేని నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ నెల 21 నుండి 26వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నల్గొండ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు భూపాల్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు 3, 4 వార్డులకు కలిపి ఒక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణకు మొత్తం 12 కేంద్రాలు ఏర్పాటు చేసి.. వెంటనే దరఖాస్తులను విచారణ చేస్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో 12 ఎంక్వైరీ టీమ్‌లను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
కాగా, లబ్ధిదారులు గృహ నిర్మాణా శాఖ వారు రూపొందించిన దరఖాస్తు ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలని.. అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం అర్హులైన పేదలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, ఎలాంటి అవినీతి ఆరోపణలకు, రాజకీయ పైరవిలకి చోటు లేకుండా, విచారణ నిష్పక్ష పాతంగా జరగాలని, ఎంక్వైరీ విధానాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆర్డీవోకు ఎమ్మెల్యే సూచించారు.