వంద పడకల ఆసుపత్రిని త్వరలో పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే
నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే పూర్తి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు
దిశ ,నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే పూర్తి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి మండలానికి 108 అంబులెన్స్ లు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని కేతేపల్లి కట్టంగూరు మండలాలకు మంజూరైన 108 అంబులెన్స్ లను ప్రారంభించి ఈ విధంగా మాట్లాడారు. గత పది సంవత్సరాలలో ఏ ఒక్క మండలానికి వైద్యానికి అధిక నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల పెంచిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి శనివారం రాత్రి నీటిని విడుదల చేశారు. ప్రతి ఒక్క ఎకరాకు నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రాజెక్టులు అన్నింటికీ పూర్తి చేసేందుకు నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే నాలుగేళ్లలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక పంటలు పండిస్తామన్నారు. మూసీ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు