విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం..

జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోతుంది. పట్టణానికి చివరి ప్రాంతంలో రాత్రి వేళ యువత డ్రగ్స్ తీసుకుంటూ రాద్దాంతం చేస్తున్నట్లు అక్కడి ప్రజల నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2024-07-02 13:15 GMT

దిశ నల్గొండ బ్యూరో : జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోతుంది. పట్టణానికి చివరి ప్రాంతంలో రాత్రి వేళ యువత డ్రగ్స్ తీసుకుంటూ రాద్దాంతం చేస్తున్నట్లు అక్కడి ప్రజల నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గంజాయిని ఎక్కువగా వాడుతున్నారని తెలస్తుంది. విజయవాడ, విశాఖపట్టణం, మాచర్లలతో పాటుగా హైదారాబాద్ నుంచి కూడ నల్లగొండ పట్టణానికి గంజాయి సరఫరా అవుతున్నట్లు విశ్వసనీయ సమచారం.

అయితే డ్రగ్స అమ్మకాలు మాత్రం పట్టణానికి నడిబొడ్డున్న జరుగుతున్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా గాంధీ నగర్, పాతబస్తీ, బీటిఎస్, వీటి కాలనీ, ప్రకాషం బజార్, న్యూ ప్రేమ్ టాకీస్,జమ్మల్లగూడ, అక్కచెల్మ , న్యూ ప్రేమ్ టాకీస్ లాంటి ప్రాంతాలలో జోరుగా జరుగుతున్నట్లు విడినికి. అయితే మత్తు పదార్థలు అమ్మకానికి ఆటోలు, రోడ్డు వెంట ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న వ్యాపార కేంద్రాల వద్ధే అడ్డగా ఏర్పాటు చేసుకొని విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తులే కొనుగోలు చేసిన వ్యక్తులను ఆ తర్వాత బ్లాక్ మొయిల్ చేస్తున్నట్లు తెలిసింది.

గత కొద్ది రోజుల క్రితం ప్రకాశం బజార్ ఏరియాలో ఇతర రాజస్థాన్ రాష్ట్రం నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ఆలా విక్రయించిన వ్యక్తే తన వద్ద కొనుగోలు చేసిన వ్యక్తులను బెదరించి పోలీసులకు చెపుతానని భయాభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఆ విషయం పోలీసులకు కూడా తెలిసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అతనిని అలా అరెస్టు చేసి వదిలేశారని వినికిడి. గాంధీనగర్ లో విక్రయాలు చేసే వ్యక్తుల వివరాలు డిపార్టుమెంటుకు తెలిసినప్పటికి పెద్దగా వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల పదే పదే గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల క్రితం కూడా డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే చిన్న పిల్లలు తీసుకునే కూల్ డ్రింక్స్ లో మత్తు టాబ్లెట్లు వేసుకొని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్ట్రింగ్ (string) అనే పేరు కలిగిన కూల్ డ్రింక్ ఈమధ్య ప్రతి కూల్ డ్రింక్ షాపులు, జనరల్ స్టోర్స్ లో లభిస్తుంది. అయితే డ్రగ్స్ వాడే అలవాటున్న యువత గంజాయి లాంటి పదార్థాలు దొరకని వేల మత్తుకు బానిసై ఈ కూల్డ్రింకులు టాబ్లెట్లు వేసుకుని సేవిస్తున్నారని సమాచారం. గంజాయి కంటే ఎక్కువ మత్తు ఇది తీసుకోవడం వల్ల వస్తుందని తెలుస్తోంది

స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం..సత్యనారాయణ వన్ టౌన్ సీఐ

గంజాయి ఇతర డ్రగ్స్ విక్రయాలు, వాడకం లాంటి వాటి నియంత్రణ కోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నాము అందరికీ అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

Similar News