భర్త వీుద అనుమానంతో మహిళ ఇంటికి వెళితే..ఏం జరిగిందంటే..?
అక్రమ సంబంధం ఆరోపణతో మహిళలు ఘర్షణకు దిగిన సంఘటన నేరేడుచర్ల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.
దిశ నేరేడుచర్ల :అక్రమ సంబంధం ఆరోపణతో మహిళలు ఘర్షణకు దిగిన సంఘటన నేరేడుచర్ల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.తన భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం ఉందన్నాఅనుమానంతో ..అనుమానం ఉన్న మహిళ ఇంటికి వెళ్ళగా..అదే సమయంలో తన భర్త అక్కడే ఉన్నాడు. దీంతో ఆ ఇంట్లో ఉన్న మహిళ తో ఘర్షణ దిగింది. ఈ సంఘటనలో ఇరువురు మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . ఎస్సై రవిందర్ నాయక్ వివరాల ప్రకారం.నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన తంతెనపల్లి రవిందర్ నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన సిరికొండ శ్రీలక్ష్మి లు కలిసి మినరల్ ఆర్వో ప్లాంట్ దుకాణంను నేరేడుచర్ల పట్టణంలోని జాన్ పహాడ్ రోడ్డులో నిర్వహిస్తున్నారు. అయితే వీరి మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రవిందర్ భార్య, కుటుంభ సభ్యులు నేరేడుచర్లకు వచ్చి రాఘవేంద్ర కాలనీలో ఇంట్లో ఉన్న శ్రీలక్ష్మిపై దాడి చేశారని ఆమె పిర్యాదు చేసింది. అదే విధంగా రవిందర్ కుటుంభ సభ్యులు కూడా శ్రీలక్ష్మి తమపై దాడి చేసిందని ఫిర్యాదు చేశారని వీరి ఇరువురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.