1000 గజాలలో మహిళా శక్తి భవనం నిర్మిస్తా : మునుగోడు ఎమ్మెల్యే

మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు

Update: 2024-12-04 09:25 GMT

దిశ,చౌటుప్పల్: మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్మూలించే బాధ్యత మహిళలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో 15 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద 1 కోటి 50 లక్షల రుణాలను అందజేశారు.చౌటుప్పల్ పట్టణంలో ఉన్న 50 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున రూ.25, 50000 రుణ సదుపాయ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.కుటుంబంలో మహిళలు ఆర్థికంగా ఉంటే కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు.

మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ పై కట్టుబడి ఉన్నామని,గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని అన్నారు. మేము పదేళ్లు ఓపికపట్టాం , కానీ బీఆర్ఎస్ నాయకులు ఒక్క సంవత్సరానికి ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు.అధికారం కోల్పోయి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని,మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తామన్నారు.ఆర్పీలకు జీతాలు వచ్చేలా సీఎం తో చర్చించి సకాలంలో జీతాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. చౌటుప్పల్ లో మహిళా శక్తి భవనంను వేయి గజాల్లో కట్టిస్తానని ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలే ముందున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం,మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


Similar News