పాలకవిడులో కానిస్టేబుల్ నరేష్ సస్పెండ్

పాలకవీడులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న డి.నరేష్ ను సస్పెండ్ చేస్తూ సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-12-04 16:05 GMT

దిశ ,పాలకవీడు: పాలకవీడులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న డి.నరేష్ ను సస్పెండ్ చేస్తూ సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకవీడులో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేష్ కోదాడ పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయన నివసించే ప్రాంతంలోనే అనంతగిరి పోలీస్ స్టేషన్లో రైటర్ గా పనిచేస్తున్న వీరబాబు నివసిస్తున్నాడు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతుంది. ఇదే విషయంలో నరేష్ డ్యూటీ పై వెళ్లి వస్తున్న వీరబాబుపై కానిస్టేబుల్ నరేష్ దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడి చేశాడని వీరబాబు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో గత వారం క్రితం ఫిర్యాదు చేశాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి క్రమశిక్షణ చర్యలో భాగంగా నరేష్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News