భూ వివాదంతో.. సెల్ టవర్ ఎక్కిన మహిళ

భూ వివాదంలో న్యాయం చేయాలని ఓ మహిళ సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన శాలిగౌరారం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-12-04 14:09 GMT

దిశ,శాలిగౌరారం : భూ వివాదంలో న్యాయం చేయాలని ఓ మహిళ సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన శాలిగౌరారం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం..శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సంకటి సత్తమ్మ తన వ్యవసాయ భూమిలో ఉన్న నాలుగు బోరు స్టార్టర్లు అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు  తేది 3.12.2024 నాడు పట్టుకెళ్లారు. దీంతో సత్తమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే పోలీసులు నిర్లక్ష్యం చేయడంతో ఆత్మహత్యే శరణ్యం అని సెల్ టవర్ ఎక్కినట్లు సంకటి సత్తమ్మ తెలిపారు. సెల్ టవర్ ఎక్కిన సత్తమ్మ గంటసేపు ఎంతమంది వారించిన దిగకపోవడంతో..పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. దీంతో సెల్ టవర్ దిగి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. ఆమె సెల్ టవర్ ఎక్కేటప్పుడు పురుగుల మందు తీసుకుపోవటంతో..తాగిందనే అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎస్ఐ సైదులు వివరణ

స్టార్టర్లు  తీసుకెళ్లినా వారిపై ఫిర్యాదు ఇచ్చిన వెంటనే వారిపై తేది 3.12.2024 నాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ  సైదులు తెలిపారు. సంకటి సత్తమ్మ ఫిర్యాదుపై ఎలాంటి నిర్లక్ష్యం చేయట్లేదని వివరణ ఇచ్చారు. వాళ్ళకు భూ తగాదలు ఉన్నాయి,అవి ఇరు వర్గాలు కోర్ట్ ద్వారా పరిష్కరించుకోవాలి,వాటిని పోలీసులు పరిష్కరించలేరని తెలిపారు. 


Similar News