సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన..
ఈనెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,ఎస్పి శరత్ చంద్ర పవర్ ఏర్పాట్లను పరిశీలించారు.
దిశ నార్కట్ పల్లి: ఈనెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,ఎస్పి శరత్ చంద్ర పవర్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పైలాన్ లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు సలహాలను అందించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి అన్నారు. అదేవిధంగా రిజర్వాయర్ వద్ద పంపును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ప్రాజెక్టు అధికారులు, తాసిల్దార్ ఎల్ వెంకటేశ్వర్లు ఆర్ఐ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.