మంచోడనుకుంటే ముంచాడు
నమ్మి అప్పు ఇచ్చారు..చివరికి ముంచి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
దిశ,కోదాడ : తనంత మంచివాడు లేడని నమ్మి అప్పు ఇచ్చారు..చివరికి ముంచి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన కోదాడ పట్టణం కాపుగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. కాపుగల్లు గ్రామానికి చెందిన వ్యక్తి కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నారు. అయితే కాపుగల్లు గ్రామానికి చెందిన 15 మంది వ్యక్తులు ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్న వ్యక్తికిమంచోడనుకుంటే ముంచాడు కోటి రూపాయలకు పైన అప్పు ఇచ్చారు. అంతేకాకుండా పట్టణంలో కూడా 40 లక్షలకు మేరా అప్పు తీసుకున్నట్లు సమాచారం. తీసుకున్న అప్పుకి వడ్డీ పెరుగుతున్న నేపథ్యంలో ఇవ్వాలని సదరు బాధితులు వ్యాపారిపై ఒత్తిడి తీసుకురావడంతో..ఒత్తిడి తట్టుకోలేని వ్యాపారి పరారీ అయినట్లుగా సమాచారం. వ్యాపారి గతం రెండు మూడు రోజులుగా కనిపించకపోవడంతో..బాధితులు లబోదిబోమంటున్నారు. వ్యాపారి ఒక యువ లాయర్ సలహా తోటే పరారీ అయినట్లుగా ఐపీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా విశ్వసించిన సమాచారం ద్వారా తెలుస్తుంది.