దిశ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ జడ్పీటీసీ

దిశ దిన పత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం చింతపల్లి మాజీ జడ్పిటిసి,నల్లగొండ జిల్లా శిశు సంక్షేమ శాఖ కమిటీ మాజీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి ఆవిష్కరించారు.

Update: 2025-01-08 10:18 GMT

దిశ,చింతపల్లి : దిశ దిన పత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం చింతపల్లి మాజీ జడ్పిటిసి,నల్లగొండ జిల్లా శిశు సంక్షేమ శాఖ కమిటీ మాజీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దిశ పత్రిక ముందుచూపుతో సమాజానికి ఉపయోగపడే కథనాలను అందించాలని కోరారు. పత్రికా రంగంలో డిజిటల్, ప్రింటింగ్,విభాగంలో సమాచారాన్ని ప్రజలకు సులభంగా చేరవేస్తున్న దిశ పత్రిక సంచలనం అని అన్నారు. దిశ పత్రిక యజమాన్యానికి,సంస్థకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దిశ పత్రిక రిపోర్టర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.


Similar News