విద్య, వైద్యం, రహదారులకు అధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే మందుల సామేల్

నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు అంశాలకు

Update: 2024-11-14 10:54 GMT

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో తిమ్మాపురం నుండి సంగెం వరకు రూ.20 కోట్ల సీఆర్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక దశాబ్దాలుగా నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కేవలం పదకొండు నెలల కాలంలోనే పరిష్కరించానని అన్నారు.

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. అదేవిధంగా తిమ్మాపురం గ్రామం వరకు రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తండాలను కలుపుతూ లింక్ రోడ్లను వేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామ అభిషేక్ రెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి, కుంట్ల సురేందర్ రెడ్డి,గుడిపెల్లి మధుకర్ రెడ్డి,కొరపిడత అవిలయ్య,రత్నం మల్లేష్, రత్నం లక్ష్మాజీ,వేములకొండ ఉప్పలయ్య, జీడి వీరాస్వామి,పాలెల్లి సురేష్,నిద్ర సంపత్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News