భారీ వర్షం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్న విద్యార్థులు

Update: 2024-08-31 10:03 GMT

దిశ, చింతలపాలెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చింతలపాలెం మండలంలో భారీ వర్షం కురుస్తుంది. కాగా శుక్రవారం సాయంత్రం నుండి భారీ వర్షం కురుస్తున్నా విద్యాశాఖ మొద్దు నిద్ర విడలేదు. మండలంలో పలు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులు స్కూలుకు వచ్చిన తర్వాత సెలవు ప్రకటించారు. భారీ వర్షంతో మండలంలోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు వాగులు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దొండపాడు గ్రామంలోని ఎర్రవాగు వద్ద విద్యార్థుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రమాదకరంగా ట్రాక్టర్ల ద్వారా వాగు దాటించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు, విద్యాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలలో వర్షపాతం నమోదు ఎక్కువ ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేసినా.. దీనికి భిన్నంగా విద్యాశాఖ మాత్రం ముందే విద్యార్థులకు సెలవు ప్రకటించకపోవడంతో స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నవి.


Similar News